‘ఆంటీ’ అన్నా సరే బాధపడలేదు..!

కొంతమంది వ్యక్తులు తనని కావాలనే ‘ఆంటీ’ అంటూ కామెంట్లు చేస్తుంటారని అలనాటి బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మండోత్కర్‌ అన్నారు. గురువారంతో ఆమె 47 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా...

Published : 05 Feb 2021 02:01 IST

అలనాటి నటి ఊర్మిళా

ముంబయి: కొంతమంది వ్యక్తులు తనని కావాలనే ‘ఆంటీ’ అంటూ కామెంట్లు చేస్తుంటారని బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మండోత్కర్‌ అన్నారు. గురువారంతో ఆమె 47 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బర్త్‌డే ప్లాన్స్‌తోపాటు కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.

‘జన్మదిన వేడుకలను భారీగా జరుపుకోవడంపై  నాకు అంతగా ఆసక్తి ఉండదు. కానీ, కుటుంబసభ్యుల పుట్టినరోజు వేడుకలకు మాత్రం ఎన్నో ప్లాన్స్ వేస్తాను. పుట్టినరోజు నాడు అవసరమైన వారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడం గురించి చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నేర్పించారు. అలా అవసరమైన వారికి ఏదో ఒకరకంగా తప్పకుండా సాయం చేస్తుంటాను’ అని ఆమె తెలిపారు.

అనంతరం తనపై వస్తోన్న ట్రోల్స్‌పై స్పందిస్తూ.. ‘సమాజంలో కొంతమంది వ్యక్తులు కావాలనే సామాజిక మాధ్యమాల వేదికగా వ్యతిరేక వ్యాఖ్యలు‌ చేస్తుంటారు. నన్ను కూడా ‘ఆంటీ’ అని పేర్కొంటూ ఎంతో మంది ట్రోల్ చేశారు. కానీ, ఆ విమర్శలు చూసినప్పుడు నేను ఏం బాధపడలేదు. ఎందుకంటే అలాంటి కామెంట్లను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ.. ముందుకు సాగిపోతుంటాను’ అని ఊర్మిళా వివరించారు.

ఇవీ చదవండి

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసు ప్రసాద్‌

మద్యం వల్లే బరువు పెరిగానని అనుకున్నారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని