Urvashi Rautela: షూటింగ్‌లో గాయాలు.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ఊర్వశీ రౌతేలా!

నటి ఊర్వశీ రౌతేలా తాను హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Updated : 10 Jul 2024 18:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వాల్తేరు వీరయ్య’లోని ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ..’ సాంగ్‌లో చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించిన బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). ప్రస్తుతం ‘ఎన్‌బీకే 109’ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారామె. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. షూటింగ్‌లో భాగంగా ఊర్వశీకి స్వల్ప గాయాలయ్యాయని వార్తలొచ్చాయి. దీంతో, తమ అభిమాన నటి ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నటి స్పందించారు. ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్న సంబంధిత దృశ్యాలు పంచుకున్నారు. అందులో విక్టరీ సింబర్‌ చూపుతూ కోలుకున్నట్టు పరోక్షంగా వెల్లడించారు.

NBK 109 గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. ‘‘బలమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. నా క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది. బాలకృష్ణ సర్‌ గొప్ప నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. టాలీవుడ్‌ వాతావరణం నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులోనూ మరిన్ని అవకాశాలు అందుకుంటానని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని