Urvashi Rautela: ‘బ్రో’ కోసం ఊర్వశి?

పవన్‌ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ‘బ్రో’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 05 Jun 2023 12:51 IST

వన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ‘బ్రో’ (BRO)తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారంలో పవన్‌, సాయితేజ్‌లపై ఓ పబ్‌ సాంగ్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలాను ఎంపిక చేశారని సమాచారం. దీనికోసం ఇప్పటికే ఓ పబ్‌ సెట్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ గీతానికి గణేష్‌, భాను నృత్య దర్శకులుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


రయ్‌.. రయ్‌.. ఓజి

వన్‌ కల్యాణ్‌ - సుజీత్‌ కలయికలో తెరకెక్కుతోన్న ‘ఓజి’ (వర్కింగ్‌ టైటిల్‌) (OG) సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది. ఈ సినిమా ఇప్పటికే ముంబయి, పుణె పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ను.. ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూడో షెడ్యూల్‌ భాగ్యనగరంలోనే ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాయి. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని రోజుల్లో పవన్‌ కూడా సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రంలో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని సమాచారం. ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రవి కె.చంద్రన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు