Allu Sirish: రొమాంటిక్‌గా అల్లు శిరీష్‌ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్‌

అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఊశ్వశివో రాక్షసివో’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. రాకేశ్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 29 Sep 2022 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు శిరీష్‌ (Allu Sirish) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. యువత లక్ష్యంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌లో వినిపించిన సంభాషణలను బట్టి అర్థమవుతోంది. స్నేహానికి, ప్రేమకు మధ్య తేడాను వివరించే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్లు స్టైలిష్‌గా కనిపించారు. టీజర్‌లో వెన్నెల కిశోర్‌ తనదైన శైలి హాస్యం పంచారు. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని