Urvasivo Rakshasivo: ఇంట్లో బుద్ధిమాన్‌.. వీధిలో శక్తిమాన్‌

అల్లు శిరీష్‌, అను ఇమ్మానుయేల్‌ జంటగా రాకేష్‌ శశి తెరకెక్కించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ధీరజ్‌ మొగిలినేని నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ

Updated : 30 Sep 2022 09:13 IST

ల్లు శిరీష్‌ (Allu Sirish), అను ఇమ్మానుయేల్‌ (Anu Emmanuel) జంటగా రాకేష్‌ శశి తెరకెక్కించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). ధీరజ్‌ మొగిలినేని నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ‘‘కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు.. ఒక్కోసారి అనుకోకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడు అది మళ్లీ మళ్లీ జరిగితే బాగుండు అనిపిస్తుంది’’ అంటూ శిరీష్‌ చెబుతున్న డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం రొమాంటిక్‌గా సాగింది. సినిమాలో ప్రేమకు, స్నేహానికి మధ్య ఉన్న తేడాను దర్శకుడు చర్చించినట్లు అర్థమవుతోంది. యువతరం కోరుకునే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘నువ్వు మామూలోడివి కాదు రాజా.. ఇంట్లో బుద్ధిమాన్‌.. వీధిలో శక్తిమాన్‌’’ అంటూ టీజర్‌లో శిరీష్‌ పాత్ర గురించి పోసాని కృష్ణమురళి పేల్చిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని