Manike Mage Hithe: అమెరికాలోనూ ‘మాణికే మాగే హితే’ ట్రెండ్‌ 

మొబైల్‌ రింగ్‌ టోన్స్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వరకూ సింగర్‌ యొహిని పాడిన ‘మాణికే మాగే హితే’ పాట ఎంత ఫేమస్‌ అయ్యిందో మనందరికీ తెలిసిందే. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, మాధురి దీక్షిత్ తో పాటు సంగీత ప్రియులందరూ ...

Updated : 01 Oct 2021 07:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ రింగ్‌ టోన్స్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వరకూ సింగర్‌ యొహిని పాడిన ‘మాణికే మాగే హితే’ పాట ఎంత ఫేమస్‌ అయ్యిందో మనందరికీ తెలిసిందే. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, మాధురి దీక్షిత్ తో పాటు సంగీత ప్రియులందరూ ఈ పాటకు ఫిదా అయ్యారు. శ్రీలంక భాషలో ఈ ఒరిజినల్‌ పాట రాగా.. తరువాత హిందీ, తెలుగు, తమిళ, కన్నడ బెంగాళీ వర్షెన్స్‌లోనూ ఈ సాంగ్‌ విడుదలైంది. తాజాగా అమెరికాలోనూ ‘మాణికే మాగే హితే’  క్రేజ్‌ సంపాదించుకుంది. కాలిఫోర్నియాకి చెందిన ఓ 12ఏళ్ల అమ్మాయి కరోలినా ప్రోట్సెంకో ఈపాటను రోడ్‌మీద డ్యాన్స్‌ చేస్తూ వయోలిన్‌తో ప్లే చేయగా.. అక్కడున్న వారంతా ఆకర్షితులై  కెమెరాల్లో బంధించారు.  ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారామె.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని