Usha Uthup: గాయని ఉషా ఉతుప్‌ భర్త కన్నుమూత

ప్రముఖ గాయని, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ఉషా ఉతుప్‌ భర్త జానీ చాకో ఉతుప్‌ (78) సోమవారం కోల్‌కతాలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఇంట్లో టీవీ చూస్తుండగా ఛాతినొప్పితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Published : 10 Jul 2024 00:58 IST

ప్రముఖ గాయని, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ఉషా ఉతుప్‌ భర్త జానీ చాకో ఉతుప్‌ (78) సోమవారం కోల్‌కతాలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఇంట్లో టీవీ చూస్తుండగా ఛాతినొప్పితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తేయాకు తోటల యజమాని అయిన జానీ.. ఉషాకి రెండో భర్త. మొదటి భర్త రాము మరణానంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి కూతురు అంజలి, కొడుకు సన్నీ ఉన్నారు. ‘నాన్నా.. మీరు మమ్మల్ని ఇంత త్వరగా వదిలి వెళ్లిపోయారు. కానీ మీ రూపం మాలో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. మీరు ప్రపంచంలోనే అత్యంత అందమైన, గొప్ప మనసున్న వ్యక్తి’ అంటూ అంజలి ఈ సందర్భంగా ఓ భావోద్వేగభరిత పోస్టు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని