Usha Uthup: టీవీ చూస్తూ గుండెపోటుతో కుప్పకూలి.. ప్రముఖ గాయని భర్త కన్నుమూత

ఉషా ఉతుప్‌ భర్త తుదిశ్వాస విడిచారు. టీవీ చూస్తూ గుండెపోటుకు గురయ్యారు.

Updated : 09 Jul 2024 12:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ (Usha Uthup) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్‌ (78) సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని వారి నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. టీవీ చూస్తోన్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉషా ఉతుప్‌కు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. తండ్రి మరణంపై అంజలి తన సోషల్‌మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘నాన్నా.. మమ్మల్ని అందరినీ వదిలేసి చాలా త్వరగా వెళ్లిపోయావు. నువ్వు ఎంతో స్టైలిష్‌గా జీవించావు. ప్రపంచంలో అత్యంత అందమైన మనిషివి. మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని రాసుకొచ్చారు.

‘కల్కి’ టీమ్‌కు హ్యాట్సాఫ్‌.. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండమే..: మహేశ్‌ బాబు

ఎలాంటి పాటనైనా తన స్టైల్‌లో పాడి అలరిస్తారు ఉషా ఉతుప్‌. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలోని పాటకు ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘కీచురాళ్లు’ టైటిల్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉషా.. ఇక్కడ కూడా చాలా పాటలు పాడి అలరించారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ టైటిల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పటివరకు 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. ఆమె సంగీత రంగానికి చేసిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని