Ravi Teja: ప్రభుత్వ అధికారిగా రవితేజ.. ‘ఆన్‌ డ్యూటీ’ అప్పటి నుంచే!

ప్రముఖ నటుడు రవితేజ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. వాటిల్లో ప్రభుత్వ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’.

Published : 06 Dec 2021 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రవితేజ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ప్రభుత్వ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. 2022 మార్చి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామ్‌ సి.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు ‘ఖిలాడి’, ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’లతో రవితేజ బిజీగా ఉన్నారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని