sivasankar: శివశంకర్‌ మాస్టర్‌పై మంచు విష్ణు ట్వీట్‌

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ గురించి నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో....

Updated : 26 Nov 2021 14:40 IST

హైదరాబాద్‌: ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌(Sivasankar) మాస్టర్‌ గురించి నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను  ఫోన్‌లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. ‘‘ఏఐజీ ఆస్పత్రి బృందంతో మాట్లాడాను. శివశంకర్‌(Sivasankar) మాస్టర్‌ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. మాస్టర్‌ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు ఆయన కుటుంబానికి మీ ప్రార్థనలు ఎంతో అవసరం’’ అని విష్ణు ట్వీట్‌ చేశారు.

కరోనా బారిన పడి గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స  పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్దకుమారుడికి సైతం వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంలో మాస్టర్‌ కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్, ధనుష్‌.. తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని