Updated : 08/12/2021 13:51 IST

Jabardasth: ‘జబర్దస్త్‌’ను వీడనున్న ‘సుడిగాలి సుధీర్‌’ టీమ్‌... నిజమేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుడిగాలి సుధీర్‌ టీమ్‌ జబర్దస్త్‌ను వీడిపోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వచ్చే వారం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో ఈ విషయమై క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. తాము ‘జబర్దస్‌’ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ సుధీర్‌, శ్రీను, రామ్‌ప్రసాద్‌ స్టేజీ మీద చెప్పుకొచ్చారు. ‘‘మేం ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం. కానీ, ఈ వేదికపై చెప్పాల్సి వస్తోంది. ఇకపై జబర్దస్త్‌ నుంచి మేం వెళ్లిపోవాలనుకుంటున్నాం!! మమ్మల్ని క్షమించండి. ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు. అయితే ఇది నిజంగా జరిగిందా? లేక స్కిట్‌ కోసం చేసిందా? అనేది తెలియాల్సి ఉంది. 

మరోవైపు ‘సుధీర్‌ స్పెషల్‌ స్కిట్’ పేరుతో ఈ టీమ్‌ హంగామా చేసింది. రాకెట్‌ రాఘవ ఫ్యామిలీ, ఆదితో వీరు చేసిన అల్లరి వావ్‌ అనిపిస్తుంది. రాఘవ తనయుడు మురారీ... సుధీర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు. పంచ్‌ మీద పంచ్‌ విసిరి కితకితలు పెట్టాడు. ఇలాంటి మరిన్ని నవ్వుల చమక్కులు చూసి ఎంజాయ్‌ చేయండి. 

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని