Published : 09/12/2021 01:50 IST

Bigg boss 5: ఇలా చేస్తే టాస్క్‌ చేయను బిగ్‌బాస్‌.. షణ్ముఖ్‌ అసహనం.. సిరి కన్నీటి పర్యంతం

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌ ‘రోల్‌ ప్లే సిరీస్‌’ కొనసాగుతోంది. మంగళవారం సిరి-సన్నీల మధ్య జరిగిన గొడవ, మానస్‌-ప్రియాంకల ప్రయాణాన్ని ఇంటి సభ్యులు అనుకరించిన విధానం నవ్వులు పూయించింది. ఈ క్రమంలో ప్రతి విషయంలోనూ సిరిని షణ్ముఖ్‌ కంట్రోల్‌ చేస్తున్నాడని మానస్‌-కాజల్‌ మాట్లాడుకున్నారు. కళ్లతోనే ఆమెను నిలువరిస్తున్నాడని, అలా చేస్తే సిరి వ్యక్తిత్వం కోల్పోయినట్టే అనుకున్నారు. రోల్‌ ప్లేలో భాగంగా ఈసారి జస్వంత్‌-శ్రీరామ్‌ల మధ్య జరిగిన గొడవ రీక్రియేట్‌ చేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ క్రమంలో ఎవరు ఏ పాత్ర చేయాలన్న దానిపై హౌస్‌మేట్స్ మధ్య చర్చ జరిగింది. ఆ రోజు షణ్ముఖ్ ఎలా చేశాడో సన్నీ చేసి చూపించడంపై షణ్ను అసహనం వ్యక్తం చేశాడు. ఇమిటేట్‌ చేయటం తనకు నచ్చదని సన్నీని హెచ్చరించాడు.

‘నిన్న ఇమిటేట్ చేసి సారీ చెప్పావు. మళ్లీ అలా చేయనన్నావు. ఎందుకు ఇమిటేట్‌ చేస్తున్నావు’ అని షణ్ముఖ్ మండిపడ్డాడు. ఈ విషయమై కాజల్‌, మానస్‌, సన్నీల మధ్య వాగ్వాదం జరిగింది. తాను కావాలని అలా చేయలేదని, ప్రతిదాన్నీ తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అని సన్నీ వాపోయాడు. మరోవైపు షణ్ముఖ్‌కు సర్ది చెప్పేందుకు సిరి ప్రయత్నించగా ఆమెపై కూడా అరిచాడు. ‘మాటలు అన్నా పడ్డాను. నన్ను ఇమిటేట్ చేస్తే నచ్చదు. సారీ బిగ్‌బాస్. ఈ టాస్క్‌ చేయను. జనాలు కూడా ఎంజాయ్‌ చేస్తారు. కానీ నేను దాన్ని తీసుకోలేను’ అంటూ  షణ్ముఖ్ చెప్పాడు. ఈ విషయమై సిరి, మానస్‌లు షణ్నుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అతడు వినలేదు.

సిరిపై షణ్ముఖ్‌ ఆగ్రహం

వాష్‌ ఏరియాలో కూర్చొన్న షణ్ముఖ్‌ను సముదాయించేందుకు సిరి ప్రయత్నించింది. అయినా కూడా అతడు కోపంతో ఊగిపోయాడు. ‘‘అవతలి వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఫ్రెండ్‌కి ఇవ్వవు. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావు. నువ్వు ఎవరికో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయితే నేను ఆపాను. నిన్ను ఎవరో అప్పడమంటే నేను ఎదురుతిరిగాను. మీ మదర్‌ వచ్చి అందరి ముందు హగ్‌ గురించి మాట్లాడారు.. ఈ మొత్తం వ్యవహారంలో నేను నెగెటివ్‌ అవ్వడం లేదా? వెళ్లిపో. ఇప్పటి నుంచి మిగతా ఇంటిసభ్యులు ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే’’ అని షణ్ముఖ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిద్దరి మధ్య జరిగే గొడవను ఆపమని మానస్‌, శ్రీరామ్‌లను సన్నీ కోరాడు. ‘మనం వెళ్ల కూడదు బ్రో’ అంటూ శ్రీరామ్‌ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.

ఓటు అడిగే అవకాశం దక్కించుకున్న షణ్ముఖ్‌

షణ్ముఖ్ మాటలతో బాధపడిన సిరి‘నేను అడిగానా వెయిట్‌ ఇవ్వమని, నేను అడిగానా నెత్తిన పెట్టుకోమని’అంటూ సిరి కన్నీటి పర్యంతమైంది. అక్కడకు వచ్చిన షణ్ముఖ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘ఎమోషన్‌కు బుర్ర అవసరం లేదు. హార్ట్‌ అవసరం’ అంటూ సిరికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్‌ తెచ్చిన దోశలను సిరి తినడంతో ఇద్దరి మధ్య గొడవ సర్దు మణిగింది. కోపాలు, అరుపులు, అలకల తర్వాత ఎట్టకేలకు జస్వంత్‌-శ్రీరామ్‌ల మధ్య జరిగిన గొడవ రీక్రియేట్‌ చేశారు.

ఇప్పటివరకూ జరిగిన టాస్క్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్‌ చేసినట్లు హౌస్‌మేట్స్‌ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి షణ్ముఖ్‌ను ఎంపిక చేయగా, ప్రేక్షకులను ఓటు అడిగే అవకాశం పొందాడు. ‘ఇప్పటివరకూ నా జర్నీ చూశారు. మీ(ప్రేక్షకులు)వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. అదే సమయంలో హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి నాకు ఓటు అడిగే అవకాశం ఇచ్చారు. నాతో పాటు వాళ్లను ప్రోత్సహించండి. కాకపోతే నన్ను ఇంకాస్త ఎక్కువ ప్రోత్సహించండి’ అని షణ్ముఖ్‌ ప్రేక్షకులను ఓటు అడిగాడు.

హౌస్‌మేట్స్‌కు రెండో అవకాశం

గార్డెన్‌ ఏరియాలో హాట్‌ సీట్‌ ఉంచిన బిగ్‌బాస్‌ దానిలో కూర్చొని ఎక్కువ సేపు నవ్వకుండా ఉండేవాళ్లకు ఓటు అప్పీల్‌ చేసుకుని అవకాశం వస్తుందని బిగ్‌బాస్‌ చెప్పాడు. తొలి అవకాశం షణ్ముఖ్‌, ఆ తర్వాత కాజల్‌, శ్రీరామ్‌, సిరి, సన్నీ, మానస్‌లు దక్కించుకున్నారు. శ్రీరామ్‌, మానస్‌లు మినహా మిగిలిన హౌస్‌మేట్స్‌ నవ్వకుండా ఉండలేకపోయారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని