Vaarasudu: దిల్‌రాజు ఇంట ‘వారసుడు’ వేడుకలు.. డ్యాన్స్‌ చేసిన నిర్మాత మనవరాలు

నిర్మాత దిల్‌రాజు (Dilraju) ఇంట ‘వారసుడు’ (Vaarasudu) సెలబ్రేషన్స్‌ సందడిగా జరిగాయి. విజయ్‌(Vijay)తోపాటు చిత్ర దర్శకుడు వంశీపైడిపల్లి, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

Published : 22 Jan 2023 14:14 IST

హైదరాబాద్‌: విజయ్‌ (Vijay) హీరోగా దిల్‌రాజు (Dil Raju) నిర్మించిన చిత్రం ‘వారిసు’ (Vaarisu). సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌లోని దిల్‌రాజు నివాసంలో ‘వారసుడు’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (Vaarasudu Success Party) జరిగాయి. ఈ వేడుకల్లో హీరో విజయ్‌ సందడి చేశారు. ఇతర చిత్రబృందంతోపాటు దిల్‌రాజు కుటుంబసభ్యులతోనూ ఆయన ఫొటోలు దిగారు. దిల్‌రాజు మనవరాలు ఇషిత ఈ వేడుకల్లో ‘రంజితమే’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీనిని చూసి మురిసిపోయిన విజయ్‌ ఆ పాపను ఎత్తుకుని ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, రష్మిక ఈ వేడుకల్లో కనిపించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని