Vaarasudu: హృదయాన్ని హత్తుకుంటాడు ‘వారసుడు’

‘‘కథ, యాక్షన్‌, ఎమోషన్‌, పాటలు.. ఏ రకంగా చూసినా ‘వారసుడు’ ఓ పండగ లాంటి సినిమా’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.

Updated : 13 Jan 2023 08:25 IST

‘‘కథ, యాక్షన్‌, ఎమోషన్‌, పాటలు.. ఏ రకంగా చూసినా ‘వారసుడు’ (Vaarasudu) ఓ పండగ లాంటి సినిమా’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi paidipally). ఆయన దర్శకత్వంలో విజయ్‌ (Vijay) కథానాయకుడిగా నటించిన చిత్రమే ‘వారసుడు’. దిల్‌రాజు (Dil Raju), శిరీష్‌ నిర్మించారు. రష్మిక (Rashmika) కథానాయిక. శ్రీకాంత్‌, శరత్‌ కుమార్‌, జయసుధ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే తమిళంలో విడుదలైన ఈ సినిమా శనివారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం కోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌బాబు ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఇటీవలే గుండెపోటుతో కన్నుమూశారు. మా ‘వారసుడు’ను ఆయనకే అంకితమిస్తున్నాం. తమిళంలో ‘వారిసు’కు వచ్చిన స్పందనే.. తెలుగులో ‘వారసుడు’కు వస్తుందని నమ్ముతున్నాం. ‘వారసుడు’ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటాడు’’ అన్నారు. ‘‘అక్కడ మనవాళ్లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తీసుకెళ్లి ప్రపంచం మొత్తానికీ తెలుగు సినిమాని చూపించారు. ఈరోజున నేను, వంశీ పైడిపల్లి వెళ్లి ‘వారిసు’తో తమిళనాడులో ఓ సూపర్‌ హిట్‌ కొట్టి వచ్చాం.  తెలుగులోనూ చక్కటి విజయాన్ని దక్కించుకుంటామని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఈ కార్యక్రమంలో శరత్‌ కుమార్‌, జయసుధ, శ్రీకాంత్‌, తమన్‌, శ్యామ్‌, ఉదయ్‌, శ్రీనివాస్‌, హరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని