Vaishnav Tej: యాక్షన్‌ రోల్‌లో వైష్ణవ్‌.. మరో కొత్త ప్రాజెక్ట్‌లో మెగా హీరో

‘‘ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిచే రుద్ర కాళేశ్వరుడు’’ అని అంటున్నారు నటుడు వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej). ‘ఉప్పెన’ (Uppena)తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా హీరో వరుస సినిమాలు చేస్తూ...

Updated : 22 Jun 2022 16:52 IST

హైదరాబాద్‌: ‘‘ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిచే రుద్ర కాళేశ్వరుడు’’ అని అంటున్నారు నటుడు వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej). ‘ఉప్పెన’ (Uppena)తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా హీరో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన నటించిన ‘రంగరంగ వైభవంగా’ విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ని బుధవారం అనౌన్స్‌ చేశారు. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఫ్యాక్షన్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానున్న ఈ సినిమాలో వైష్ణవ్‌ రోల్‌ పవర్‌ఫుల్‌గా ఉండనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది రూపుదిద్దుకోనుంది. శ్రీలీలా కథానాయిక. ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. ‘‘రేయ్‌ రాముడు లంక మీద పడటం వినుంటావు.. అదే పది తలకాయల వాడు అయోధ్య మీద పడితే ఎట్టుంటాదో చూస్తావా’’ అనే డైలాగ్‌లతో సాగిన వీడియో సినిమాపై ఉత్కంఠ రేకేత్తించేలా ఉంది. ఈ సినిమా షూట్‌ త్వరలో ప్రారంభం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని