‘వకీల్‌ సాబ్‌’ వచ్చే వేళయింది

ఈ ఏడాది సినీ ప్రియులకు మరో పెద్ద తీపి కబురు వినిపించింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్‌ 9న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. దీంతో పవర్‌స్టార్‌ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.

Updated : 30 Jan 2021 19:07 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది సినీ ప్రియులకు మరో పెద్ద తీపి కబురు వినిపించింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. వేసవి కానుకగా ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. దీంతో పవర్‌స్టార్‌ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. రాజకీయాల కారణంగా చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పవర్‌స్టార్‌. ‘వకీల్‌సాబ్‌’తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..’ అంటూ సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతోందన్నది రుచి చూపించారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ నటించింది. తమన్‌ సంగీతం అందించారు. హిందీలో మంచి విజయం సాధించిన పింక్‌ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

#NTR30: హీరోయిన్‌ ఈమేనా?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని