నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఇటీవలే విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో సినీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్రబృందం.

Updated : 12 Apr 2021 08:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఇటీవలే విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో సినీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలో పవన్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ సంభాషణల్ని ప్రోమో రూపంలో విడుదల చేసింది. ‘నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా. కానీ, దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే’, ‘ఆడదంటే వాడి బాత్‌రూమ్‌లో గోడమీద ఉండే బొమ్మ కాదు.. వాడ్ని కనిపెంచిన అమ్మ కూడా’ అంటూ పవన్‌ పలికిన తీరు భావోద్వేగానికి గురి చేస్తుంది.

హిందీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా కొన్ని మార్పులు చేసి ‘వకీల్‌ సాబ్‌’ తెరకెక్కించారు శ్రీరామ్‌ వేణు. ప్రకాశ్‌ రాజ్‌, శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పించారు. 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని