‘vakeel saab’ సెట్‌ నుంచి వర్కింగ్‌ స్టిల్స్‌

పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘వకీల్‌సాబ్‌’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది.

Published : 20 Apr 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘వకీల్‌సాబ్‌’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మించారు. కాగా.. ఈ సినిమాతో పవన్‌కల్యాణ్‌ మూడేళ్ల తర్వాత మంచి హిట్‌ అందుకున్నారు. మరోవైపు చిత్రబృందం విజయోత్సవాల్లో పాల్గొంటోంది. తాజాగా.. వకీల్‌సాబ్‌ డైరీస్‌ పేరుతో సెట్‌లో క్లిక్‌మనిపించిన కొన్ని ఫొటోలను నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ‘సెట్స్‌లో పవర్‌ఫుల్‌ వాతావరణం..’ అంటూ అందులో రాసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని