‘వకీల్‌సాబ్‌’.. మరో పాట ఎప్పుడంటే

పవన్‌ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రుతి హాసన్‌, అంజలి, అనన్య, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఓ అప్‌డేట్‌ని ప్రకటించింది చిత్రబృందం.

Published : 15 Mar 2021 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రుతి హాసన్‌, అంజలి, అనన్య, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాలోని మూడో పాటని (లిరిలక్‌ వీడియో) మార్చి 17న సాయంత్రం 5గం.లకు విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు దర్శక-నిర్మాతలు. ‘కంటి పాప.. కంటి పాప..’ అంటూ సాగే గీతానికి సంబంధించి వీడియోను పంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’ శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దిల్‌ రాజు, బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది ఈ చిత్రం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని