
ప్రియమైన వారికి ప్రేమతో..
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమికుల రోజున తాము అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు మన సినీ సెలబ్రిటీలు ప్రేమతో తమ మనసులోని భావాలను తెలియజేశారు. అపురూపమైన చిత్రాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన కూతురు సితార తయారు చేసిన వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డును ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ‘థాంక్యూ సీతూ పాప’అంటూ వాలంటైన్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు.
నా జీవితంలోని ప్రేమకు ‘వాలంటైన్స్ డే’ శుభాకాంక్షలు అంటూ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన సతీమణితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో దిగిన ఫొటోలతో కూడిన వీడియోను పంచుకుంది.
నటి అర్చన తన భర్తతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘కాలం పరీక్షించిన ప్రతిసారి ఒకరికొకరం తోడుగా నిలుస్తున్నాం. పెళ్లినాటి ప్రమాణాన్ని నిజం చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు.
నటుడు ఆర్య సతీమణి సాయేషాతో దిగిన ఫొటోను నెటిజన్లతో పంచుకుంటూ ‘మరణం తర్వాత కూడా నిను ప్రేమిస్తూనే ఉంటా’నంటూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆ పోస్ట్‌లను మీరు ఒకసారి చూసేయండి!
ఇవీ చదవండి!
సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు
గోపీచంద్-మారుతి కాంబో టైటిల్ ఇదే!