వైరల్‌గా ‘వాలిమై ’ అప్‌డేట్‌!

అజిత్‌ హీరోగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేయాలంటూ అజిత్‌ అభిమానులు  ఎప్పటి నుంచో సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందాన్ని కోరుతున్నారు. దీనిపై బోనీ కపూర్‌ తాజాగా స్పందించారు. ‘నమస్కారం. మన సినిమా ‘వాలిమై’పై మీరు ఇంతటి ప్రేమ చూపిస్తున్నందుకు గర్వంగా ఉంది.

Published : 16 Feb 2021 13:00 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అజిత్‌ హీరోగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేయాలంటూ అజిత్‌ అభిమానులు  ఎప్పటి నుంచో సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందాన్ని కోరుతున్నారు. దీనిపై బోనీ కపూర్‌ తాజాగా స్పందించారు. ‘నమస్కారం. మన సినిమా ‘వాలిమై’పై మీరు ఇంతటి ప్రేమ చూపిస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రస్తుతం ఫస్ట్‌లుక్‌ని మీ ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాం’ అని తెలియజేశారు. ఈ శుభవార్తతో పండగ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. త్వరలోనే వాలిమై నుంచి అజిత్‌ ఫస్ట్‌లుక్‌ రాబోతుందంటూ సంబంధిత హ్యాష్‌ట్యాగ్స్‌ జతచేయడంతో ట్విటర్‌లో ట్రెండింగా నిలిచిందీ చిత్ర అప్‌డేట్‌.

ఇంగ్లాండ్‌-ఇండియా మధ్య చెన్నైలో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లోనూ ఈ సినిమా అప్‌డేట్‌ కావాలంటూ అభిమానులు కోరడం విశేషం. అభిమానుల అంచనాలు అందుకునేలా అతి త్వరలోనే అజిత్‌ లుక్‌ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన హ్యూమా ఖురేషీ నటిస్తోంది. యువ నటుడు కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని