Valimai: అజిత్‌ ‘వలిమై’ తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది..!

సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వలిమై’ తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది.

Published : 10 Feb 2022 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వలిమై’ తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశంతో మొదలయ్యే ఈ ప్రచార చిత్రం ఆసక్తిగా సాగింది. అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా, ప్రతినాయకుడి పాత్రలో కార్తికేయ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. అజిత్‌, కార్తికేయ లుక్స్‌, వారు చెప్పిన సంభాషణలు మెప్పిస్తున్నాయి. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యూమా ఖురేషి కథానాయిక. సుమిత్ర, అచ్చుత్‌ కుమార్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి బోనీ కపూర్‌ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 24న విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని