Vijay: ఇది కదా బిగ్‌ అనౌన్స్‌మెంట్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఆయన కథానాయకుడిగా త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్‌లో పేరు పొందిన డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమాలో నటించనున్నారు...

Published : 30 May 2021 12:04 IST

తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరో

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఆయన కథానాయకుడిగా త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్‌లో పేరు పొందిన డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా వంశీ బయటపెట్టారు. ‘విజయ్‌తో ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. విభిన్నమైన కథ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నెమ్మదిగా వెల్లడిస్తాం’ అని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు విజయ్‌కు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం విజయ్‌ నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో వర్క్‌ చేస్తున్నారు. అది పూర్తి అయిన వెంటనే ఆయన వంశీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని