Vamshi Paidipally: దర్శకుడికి ప్రతి సినిమా సవాలే!
‘‘భాష ఏదైనా... భావోద్వేగాలు మాత్రం ఒక్కటే’’ అంటున్నారు వంశీ పైడిపల్లి. తమిళనాడులో చాలాఏళ్ల తర్వాత కుటుంబ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడాయనే ప్రశంసలు ఓ దర్శకుడిగా ఎంతో తృప్తినిచ్చాయని చెప్పారు.
‘‘భాష ఏదైనా... భావోద్వేగాలు మాత్రం ఒక్కటే’’ అంటున్నారు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally). తమిళనాడులో చాలాఏళ్ల తర్వాత కుటుంబ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడాయనే ప్రశంసలు ఓ దర్శకుడిగా ఎంతో తృప్తినిచ్చాయని చెప్పారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్ని తీసిన ఆయన... ఇటీవల తమిళంలో విజయ్ (Vijay) కథానాయకుడిగా ‘వారిసు’ తెరకెక్కించారు. ఆ చిత్రం తెలుగులో ‘వారసుడు’గా (Vaarasudu) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘కథే కథానాయకుల్ని వెదుక్కుంటూ వెళుతుందనే మాటని బలంగా విశ్వసిస్తా. మహేష్‌బాబు (Mahesh Babu) కోసం ‘మహర్షి’ తర్వాత ఓ కథ అనుకున్నా అది సాధ్యపడలేదు. అప్పుడే ‘ఇలా మరో కథ అనుకున్నాం’ అని నిర్మాత దిల్‌రాజుకి (Dil Raju) చెప్పగానే ఆయన విజయ్ (Vijay) పేరు సూచించారు. మా ప్రణాళికలో లేని ఆలోచన అది. ఈ రోజుల్లో సినిమాలకి హద్దులంటూ ఏమీ లేవు. అదే మరోసారి రుజువైంది. మొదట షాక్‌గా అనిపించినా, దిల్‌రాజు చెప్పినట్టుగానే విజయ్‌కి ఈ కథ వినిపించాం. ఈ కథని ఒప్పుకున్నాక అప్పుడు ఆయన బలాల్ని అంచనా వేసుకుని, ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దాం. గత చిత్రాల్లో విజయ్ ఎలా కనిపించారో, అలా ఇందులో ఆయన్ని చూపించాలనేది మా ప్లాన్. దానికితోడు ఆయన స్టైల్ పాటలు, ఫైట్లతో పక్కాగా ఓ కమర్షియల్ సినిమా చేశాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో తృప్తినిస్తోంది. యువతరం వెళ్లి ఇంట్లోవాళ్లకి ఈ సినిమాని చూడండని చెబుతున్నారు. హిందీ, తెలుగు భాషల్లోనూ సినిమాకి ఆదరణ లభిస్తుండడం చాలా ఆనందంగా ఉంది’’.
* ‘‘కథానాయకుల్లో ఒకొక్కరిది ఒక్కో పంథా. విజయ్ వారం రోజుల ముందే స్క్రిప్ట్ చూసుకుంటారు. సన్నివేశాలు, డ్యాన్స్ విషయంలో రిహార్సల్స్ చేస్తారు. అదే ఆయన బలం. చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ‘దర్శకుడిగా మీరు హ్యాపీనా?’ అని అడుగుతుంటారు. సినిమా విడుదల తర్వాత కలిసినప్పుడు ‘మీరు హ్యాపీనా సర్’ అని అడిగా. నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఓ దర్శకుడికి అది చాలు కదా. భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటున్నాయి. తండ్రీ కొడుకుల బంధాన్ని ఆవిష్కరించిన విధానాన్ని చూసి, చివర్లో లేచి వస్తున్నప్పుడు కూడా చప్పట్లు కొడుతూ కళ్లు తుడుచుకుంటూ వస్తున్నారు. తమన్ సంగీతం సినిమాకి ఆత్మలా నిలిచింది’’.
* ‘‘దర్శకుడిగా నా శైలి మారిందంటే ‘ఊపిరి’ సినిమా నుంచే. అంతకుముందు సినిమాల అనుభవం ఆ సినిమాకి పనికొచ్చింది. ఆ సినిమానేమో నా ఆలోచనా ధోరణినే మార్చింది. అందుకే ‘మహర్షి’, ‘వారసుడు’ చిత్రాలొచ్చాయి. చిన్నప్పట్నుంచి అగ్ర తారలు నటించిన వాణిజ్య ప్రధానమైన సినిమాలు చూస్తూ పెరిగాను. నేను పరిశ్రమకి అలాంటి సినిమాలు తీయడానికే వచ్చా. ‘వారసుడు’ విడుదల కాక ముందే విజయ్ నాతో మరో సినిమాకి చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అదెంతో తృప్తినిచ్చింది. మా ప్రయాణం కచ్చితంగా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రతి దర్శకుడూ తను చేస్తున్న సినిమాని చివరి ఇన్నింగ్స్‌లాగే భావిస్తున్నాడు. ప్రతి సినిమా ఓ సవాలే. అంతకుముందు సినిమా కంటే ఉత్తమంగా ఉండాలి, దర్శకుడిగా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. ప్రస్తుతానికి ‘వారసుడు’ సినిమా ఫలితాన్ని ఆస్వాదిస్తున్నా. తర్వాత మరో కొత్త సవాల్‌తో కొత్త ప్రయాణం మొదలుపెడతా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..