NTR: ఎన్టీఆర్‌ బర్త్‌డే వేడుకలు.. సందేహాలు వ్యక్తం చేస్తోన్న అభిమానులు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ఆయన ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది మే 20న తన పుట్టినరోజును వేడుకగా...

Published : 22 May 2022 12:13 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ సినిమా విజయంతో ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఇక మే 20న తన పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్‌ జరుపుకొన్నారు. క్లోజ్‌ఫ్రెండ్స్‌ సమక్షంలో ఎన్టీఆర్‌ నివాసంలో జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాల్గొనడంతో నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌తో సినిమా చేస్తోన్న వంశీ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్‌తో చేయనున్నారా? ఎన్టీఆర్‌-వంశీ కాంబోలో సినిమా రానుందా? అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వంశీ-ఎన్టీఆర్‌ కాంబోలో ఇప్పటికే ‘బృందావనం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, తారక్‌ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో తారక్‌ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని