Varalakshmi: ఇకపై గ్లామర్‌ పాత్రల్లో నటించను.. : వరలక్ష్మీ శరత్‌కుమార్‌

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌(Varalakshmi SarathKumar)‌ ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.  తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రల్లో నటిస్తానని తెలిపారు.

Updated : 10 Jan 2023 14:17 IST

హైదరాబాద్‌: శరత్‌కుమార్‌ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైంది వరలక్ష్మీ శరత్‌కుమార్(Varalakshmi SarathKumar)‌. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ బిజీ అర్టిస్టుగా మారిపోయింది. ఇటీవల యశోద సినిమాలో వరలక్ష్మీ తన నటనతో అందరినీ ఆకట్టుకుని సినీ పెద్దల నుంచి ప్రశంసలు పొందింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇక గ్లామర్‌ పాత్రలు చేయనని తెలిపింది.

‘‘చిత్ర పరిశ్రమలో బాల గారు నాకు గురువు. ఆయన దర్శకత్వంలో నేను నటించిన సినిమాకు వచ్చిన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను. నాకు గ్లామర్‌ రోల్స్‌  అంతగా సూట్‌ కావని నా అభిప్రాయం. అయినా సినిమాల్లో గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి చాలా మంది ఉన్నారు. ఇకపై నేను అలాంటి పాత్రలు చెయ్యను. నాకు విలన్‌ పాత్రల్లో నటించడం ఇష్టం. అందుకే నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తాను’’ అని వరలక్ష్మీ తెలిపారు.

ఇక తెలుగులో రవితేజ(Raviteja) హీరోగా నటించిన క్రాక్‌(Crack) సినిమాలో వరలక్ష్మీ ’జయమ్మ’గా అలరించింది. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. అప్పటి నుంచి ఆమెకు టాలీవుడ్‌లోనూ వరసగా అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna) హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy)లోనూ వరలక్ష్మీ నటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని