Varalaxmi Sarathkumar: అల్లు అర్జున్‌తో వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. ఫొటోలు వైరల్‌

అల్లు అర్జున్‌తో సెల్ఫీ తీసుకున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. వీరు ఎక్కడ మీట్‌ అయ్యారంటే?

Published : 21 Jun 2024 18:29 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇంట సందడి చేశారు. కాబోయే భర్త సచ్‌దేవ్‌తో కలిసి వెళ్లి, తమ పెళ్లికి రావాలంటూ అల్లు కుటుంబాన్ని ఆహ్వానించారు. శుభలేఖను అందించారు. అనంతరం, అర్జున్‌, ఆయన తండ్రి అరవింద్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. సంబంధిత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బన్నీతో కలిసి వరలక్ష్మి తీసుకున్న సెల్ఫీ క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, అల్లు అర్జున్‌తో మీటింగ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు వరలక్ష్మి. దానిపై అర్జున్‌ స్పందిస్తూ.. తనకూ సంతోషంగా ఉందన్నారు.

సినీ తారల ‘యోగా’ ఫొటోలు.. రకుల్‌ప్రీత్‌ అలా.. మలైకా ఇలా

తన వివాహ తేదీ వివరాలను వరలక్ష్మి ఇంకా అభిమానులతో పంచుకోలేదు. జులై మొదటి వారంలో వేడుక ఉండొచ్చని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే పలువురు తమిళ నటులను ఆహ్వానించారు. ముంబయికి చెందిన సచ్‌దేవ్‌ వ్యాపారవేత్త. ‘క్రాక్‌’, ‘వీరసింహారెడ్డి’, ‘హనుమాన్‌’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని