Varalaxmi Sarathkumar: పదేళ్ల సినీ ప్రయాణంపై ప్రముఖ నటి ఎమోషనల్‌ పోస్ట్‌..

తాజాగా యశోద సినిమాలో కీలకపాత్రలో కనిపించి అలరించారు వరలక్ష్మీ శరత్‌ కుమార్. ఆమె సినీ ప్రయాణం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్‌మీడియాలో  ఓ పోస్ట్‌ పెట్టారు.

Published : 14 Nov 2022 15:39 IST

హైదరాబాద్‌: వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. తాజాగా యశోద సినిమాలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. చిత్రపరిశ్రమకు వచ్చి 10  ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ నటి సోషల్‌మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

‘‘పదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ దశాబ్ద కాలం నా ప్రయాణం సులభంగా, అనుకున్న విధంగా సాగిందా అంటే.. కాదనే చెప్పాలి. ఎన్నో తిరస్కరణలకు గురయ్యాను.  అయితే.. ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. ఎంతో కృషి చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే 45 సినిమాల్లో నటించి నేనెంటో నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. అలాగే నన్ను తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ తనకు మద్దతు ఇస్తూ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని