Varisu: విజయ్‌ 66.. రష్మిక 17..‘వారిసు’ విశేషాలివి!

విజయ్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘వారసుడు’ సంగతులు చూద్దాం..

Updated : 10 Jan 2023 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద చిత్రాల్లో ‘వారిసు’ ఒకటి. తెలుగులో ‘వారుసుడు’ పేరుతో విడుదలకానుంది. ఈ సినిమా విశేషాలేంటంటే..

🎞️ హీరో విజయ్‌ (Vijay)కు ఇది 66వ చిత్రం కాగా.. హీరోయిన్‌ రష్మిక (Rashmika Mandanna)కు 15వది. అలాగే, దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)కి ఇది ఆరో చిత్రం.  

🎞️ ‘ఊపిరి’ రీమేక్‌తో వంశీ పైడిపల్లి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన నేరుగా తమిళంలో తెరకెక్కించిన చిత్రంగా ‘వారిసు’ (Varisu) నిలవనుంది.

🎞️ కథ వినగానే నటించేందుకు వెంటనే విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. టాలీవుడ్‌ హీరోలు మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌.. వీరిలో ఎవరితో ఒకరితో చేయాల్సిన సినిమా ఇది అని, అనుకున్న సమయానికి వారు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో విజయ్‌ను సంప్రదించామని నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఓ సందర్భంలో చెప్పారు.

🎞️ ఎన్నో ఏళ్ల తర్వాత విజయ్‌ (Thalapthy Vijay) నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. ప్రేక్షకులు కోరుకునే ఫన్‌, ఎమోషన్‌, ఫైట్లు, అదిరిపోయే పాటలు, డ్యాన్స్‌.. ఈ సినిమాలో ఉన్నాయని, తల్లిదండ్రులందరికీ ఈ చిత్రం (Varasudu) అంకితమని దిల్‌ రాజు ఆడియో విడుదల వేడుకలో వెల్లడించారు.

🎞️ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ నటించిన తొలి తమిళ చిత్రమిదే. ఆయనతోపాటు కిక్‌ శ్యామ్‌, శరత్‌కుమార్‌, జయసుధ, ప్రభు, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. 

🎞️ విజయ్‌ సినిమాకు సంగీత దర్శకుడు తమన్‌ ట్యూన్స్‌ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలోని ‘రంజితమే’ (Ranjithame) లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో 128 మిలియన్‌ (12 కోట్ల 80 లక్షలు) వ్యూస్‌ సాధించి, రికార్డు సృష్టించింది.

🎞️ ఈ సినిమా తమిళ ట్రైలర్‌ 39 మిలియన్లకుపైగా (3 కోట్ల 90 లక్షలకుపైగా) వీక్షణలు సొంతం చేసుకోగా.. తెలుగు ట్రైలర్‌ 5.9 మిలియన్‌ (59 లక్షలు) వ్యూస్‌ దక్కించుకుంది (జనవరి 4 నుంచి జనవరి 8 వరకు).

🎞️ చెన్నై, హైదరాబాద్‌, విశాఖపట్నం, బళ్లారి, లద్దాఖ్‌ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరించారు.

🎞️ సెన్సార్‌ బోర్డు ‘యు’ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఈ సినిమా రన్‌ టైమ్‌ 170 నిమిషాలు (సుమారు 3 గంటలు).

🎞️ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న విడుదల చేయాలనుకుంది చిత్ర బృందం. ఆ తేదీని మార్పు చేసి జనవరి 11నే రిలీజ్‌ చేస్తున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా తమిళంలో జనవరి 11న తెలుగులో జనవరి 14 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు