‘స్టాండప్‌ రాహుల్‌’ నుంచి ఫస్ట్‌లుక్‌

యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌, మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ ఫేమ్‌ వర్ష బొల్లమ్మ జంటగా ‘స్టాండప్‌ రాహుల్‌’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రేయారావ్‌ పాత్రలో వర్ష కనిపించనుంది. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. శాంటో మోహన్‌ వీరంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Published : 23 Jun 2021 23:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌, మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ ఫేమ్‌ వర్ష బొల్లమ్మ జంటగా ‘స్టాండప్‌ రాహుల్‌’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రేయారావ్‌ పాత్రలో వర్ష కనిపించనుంది. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. శాంటో మోహన్‌ వీరంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్‌, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్‌, మురళీశర్మ, ఇంద్రజ, దేవిప్రసాద్‌, మధురిత కీలక పాత్రలు పోషించారు. స్వీకర్‌ అగస్తి సంగీతం సమకూర్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని