Varsha Bollamma: నిర్మాత కుమారుడితో పెళ్లి వార్తలు.. స్పందించిన యువ నటి

‘స్వాతిముత్యం’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి వర్ష బొల్లమ్మ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌ అందుకుంది. ఈనేపథ్యంలో గత రెండు రోజుల నుంచి వర్ష పెళ్లి నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

Published : 29 Oct 2022 01:32 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాత కుమారుడితో నటి వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) వివాహం జరగనుందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్తలపై తాజాగా వర్ష స్పందించింది. అవన్నీ వదంతులు మాత్రమేనని చెప్పింది.

తన పెళ్లి గురించి పలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన కథనాలను స్క్రీన్‌ షాట్స్‌ తీసి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన ఆమె.. ‘‘నాకే తెలియకుండా నాకోసం పెళ్లి చూపులు చూసి ఒక అబ్బాయిని సెలక్ట్‌ చేసినందుకు అన్ని వెబ్‌సైట్స్‌కు ధన్యవాదాలు. ఆ అబ్బాయి ఎవరో చెబితే నేను కూడా మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తా. ప్రస్తుతం నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహాలో ‘స్వాతిముత్యం’ చూడండి’’ అని పేర్కొంది. ‘చూసీ చూడంగానే’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘జాను’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’, ‘పుష్పకవిమానం’, ‘స్టాండప్‌ రాహుల్‌’ చిత్రాలతో అలరించారు. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘స్వాతిముత్యం’ ఇటీవల విడుదలై మంచి టాక్‌ అందుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని