Bollywood: శరవేగంగా వరుణ్, జాన్వీల ప్రేమకథ

‘బవాల్‌’తో ప్రేక్షకుల్ని అలరించిన వరుణ్‌ ధావన్, జాన్వీ కపూర్‌.. ఇప్పుడు మరోసారి ప్రేమికులుగా తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారీ’.

Published : 07 Jul 2024 02:00 IST

‘బవాల్‌’తో ప్రేక్షకుల్ని అలరించిన వరుణ్‌ ధావన్, జాన్వీ కపూర్‌.. ఇప్పుడు మరోసారి ప్రేమికులుగా తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారీ’. శశాంక్‌ ఖైతాన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫొటోను పంచుకున్నాడు వరుణ్‌. ఆయనతో పాటు ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తున్న సాన్యా మల్హోత్రా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో తులసి ప్రేమను దక్కించుకోవడానికి సన్నీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించనున్నారు. అపూర్వ మెహతా, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని