Varun Dhawan: ఇలాంటి చిత్రాల్లో నటించినందుకు గర్వపడుతున్నా: వరుణ్‌ ధావన్‌

బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌(Varun Dhawan)కు 2022 సంవత్సరం నటన పరంగా ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. అలాగే భేడియా చిత్రంపై స్పందించారు.  

Published : 18 Dec 2022 13:59 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్‌ ధావన్‌(Varun Dhawan). ఈ ఏడాది పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు ఈ స్టార్‌ హీరో. వరుణ్‌-కియారా అడ్వాణీ కలిసి నటించిన ‘జగ్‌జగ్‌ జీయో’(JugJugg Jeeyo) సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ‘భేడియా’(Bhediya) చిత్రంలో వరుణ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో వరుణ్‌ ధావన్‌ మాట్లాడుతూ 2022 తన సినీ ప్రయాణంలో ముఖ్యమైనదని చెప్పారు. ఈ ఏడాది తనకు నటనపరంగా సంతృప్తినిచ్చిందని తెలిపారు.

‘ఈ సంవత్సరం నేను చేసిన జగ్‌జగ్‌ జీయో(JugJugg Jeeyo), భేడియా, బవాల్‌(Bawaal) మూడు సినిమాలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి. కొవిడ్‌ తర్వాత క్రియేటివ్‌గా ఉండే సినిమాలు మాత్రమే చేయాలని వేచి చూశాను. ఇక సినిమాలను అంగీకరించే ముందు నేను చాలా ఆలోచించాను. ఈ ఏడాది ఇలాంటివి మూడు చిత్రాల్లో నటించినందుకు గర్వపడుతున్నాను’ అని వరుణ్‌ ధావన్‌ అన్నారు. ఇక భేడియా చిత్రం గురించి స్పందిస్తూ.. ‘భేడియా సినిమా ఒక మంచి ప్రయత్నం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోయినా. ఈ చిత్రంతో పాటు విడుదలైన సినిమాలతో పోలిస్తే మంచి హిట్‌గానే నిలిచింది’ అని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని