Michael: ‘మైఖేల్‌’ కోసం వరుణ్‌..

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకుడు. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక.

Updated : 13 Mar 2022 08:40 IST

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకుడు. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నటుడు వరుణ్‌ సందేశ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ‘‘ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో గౌతమ్‌ మేనన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని