Varun Tej: బుడాపెస్ట్‌లో ‘గాండీవధారి..’ యాక్షన్‌

‘గాండీవధారి అర్జున’గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్‌ తేజ్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 07 May 2023 14:20 IST

‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna)గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తోంది. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ బుడాపెస్ట్‌లో ఈనెల 8నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా వరుణ్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరుణ్‌తేజ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ ముస్తాబవుతున్న ఈ సినిమాలో వరుణ్‌ సెక్యురిటీ ఎక్స్‌పర్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని