Ghani review: రివ్యూ: గని
Ghani movie review: వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ‘గని’ ఎలా ఉందంటే?
చిత్రం: గని; నటీనటులు: వరుణ్‌తేజ్, సయీ మంజ్రేకర్, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర, నదియా, నరేష్, తనికెళ్ల భరణి, తమన్నా (ప్రత్యేక గీతంలో) తదితరులు; ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్, ప్రొడక్షన్ డిజైన్: రవీందర్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: తమన్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: సిద్ధు ముద్ద, అల్లు బాబీ, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి; సంస్థలు: అల్లు బాబీ కంపెనీ, రినైస్సెన్స్ పిక్చర్స్; విడుదల: 8-04-2022
తెలుగులో అప్పుడప్పుడు మాత్రమే క్రీడా నేపథ్యంలో సినిమాలొస్తుంటాయి. కథానాయకులో లేదంటే దర్శకులో వ్యక్తిగత అభిరుచి కొద్దీ ఆ నేపథ్యంలో సినిమాలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతుంటాయి. అలా ఈసారి వరుణ్‌తేజ్ బాక్సింగ్‌పై ప్రేమని ప్రదర్శిస్తూ ‘గని’ కథని సిద్ధం చేయించారు. మూడేళ్ల కిందట పురుడు పోసుకున్న ఈ సినిమా కరోనాతో చిత్రీకరణ దశలోనే ఆటంకాలు ఎదుర్కొంది. సినిమా సిద్ధమయ్యాక కూడా పలుమార్లు విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. ఆలస్యమైనా ఎట్టకేలకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది? వరుణ్ తేజ్ బాక్సర్ ఎలా రాణించాడు?
కథేంటంటే: బాక్సింగ్ జోలికి వెళ్లనని తన తల్లికి మాటిచ్చి కూడా... బాక్సర్‌గా రాణించే ప్రయత్నంలో ఉంటాడు గని (వరుణ్‌తేజ్). గనికి ఘనమైన వారసత్వమే ఉంది. తను ఎవరో కాదు, ఒకప్పటి రాష్ట్ర ఛాంపియన్ బాక్సరైన విక్రమాదిత్య (ఉపేంద్ర) తనయుడు. విక్రమాదిత్య జాతీయ ఛాంపియన్‌గా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు సొంత మనుషుల చేతుల్లోనే దారుణంగా మోసపోతాడు. దానికి తోడు స్టెరాయిడ్స్ వినియోగించాడనే మచ్చ కూడా పడుతుంది. అయితే తన తండ్రి విషయంలో ఏం జరిగిందో తెలియని గని మొదట ఓ అభిప్రాయంతో ఉంటాడు. తనదైన లక్ష్యంతో తల్లికిచ్చిన మాటని కూడా పక్కనపెట్టి బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన గనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?తను అనుకున్నది ఎలా సాధించాడు? గని తన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏమిటి? అది తెలిశాక ఏం చేశాడు?ఈ కథలో విజేంద్రసిన్హా (సునీల్‌శెట్టి), ఈశ్వర్నాథ్ (జగపతిబాబు)లు ఎవరన్నది తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: క్రీడా నేపథ్యంలో సాగే సినిమాల్లో నాటకీయత పుష్కలం. ఆటలో ఎత్తులు పైఎత్తులు, ఎవరిదో గెలుపు అనే ఉత్కంఠ, ఆ క్రమంలో చోటు చేసుకునే అనూహ్య మలుపులు... ఇలా ప్రేక్షకుడిని రక్తికట్టించే అంశాలన్నీ అందులో ఉంటాయి. వీటికి క్రీడా వ్యవస్థలోని రాజకీయాలు, కుటుంబ అనుబంధాల్ని కూడా మేళవిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకర్షించేలా సినిమాల్ని రూపొందిస్తుంటారు. ‘గని’ ఆట కంటే కూడా రెండో అంశంపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు అనిపిస్తుంది. ఆటతో ముడిపడిన కథానాయకుడి ప్రతీకార కథగానే ఇది ప్రస్ఫుటం అవుతుంది. ఆటలో ఓడిపోయిన క్రీడాకారుడితో పాటు, అతని కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, వాళ్లని సమాజం చూసే విధానం చుట్టూ ఈ కథని అల్లిన విధానం ప్రత్యేకంగా అనిపిస్తుంది. స్పోర్ట్స్ డ్రామాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమానే అయినప్పటికీ, కథంతా కూడా ఓ ఫార్ములా తరహాలో ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగడం మైనస్‌గా మారింది.
ప్రథమార్ధంలో చెప్పుకోదగ్గ కథేమీ లేదు. విక్రమాదిత్య ఫ్లాష్‌బ్యాక్‌తో కథ మొదలవుతుంది సినిమా. గని, అతని ప్రేమ, కుటుంబ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. విరామ సన్నివేశాల్లో ఓ మలుపు ఉంటుంది. ద్వితీయార్ధంలోనైనా అసలు కథ, డ్రామా. విక్రమాదిత్య మోసపోయిన తీరుని ఆవిష్కరిస్తూ ద్వితీయార్ధం మొదలవుతుంది. క్రీడా వ్యవస్థలోని రాజకీయాలు, బెట్టింగ్ మాఫియా ప్రవేశం వంటి అంశాలు ద్వితీయార్ధాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. అయితే వీటికి మరింత సంఘర్షణ జోడించడం అవసరం అనిపిస్తుంది. ఇండియన్ బాక్సింగ్ లీగ్ చుట్టూ సాగే సన్నివేశాలు వర్తమాన క్రీడా వ్యవహారాల్ని గుర్తుచేస్తాయి. బాక్సింగ్ నేపథ్యం, బలమైన నటులు, ఆకట్టుకునే నిర్మాణ విలువలు... సినిమాకి కావల్సినంత ఆకర్షణ శక్తిని ఇచ్చినప్పటికీ, కథనం పరంగా మాత్రం సాదాసీదాగా అనిపిస్తుంది. బాక్సింగ్ ఫైట్స్‌తో సాగే పతాక సన్నివేశాల్ని తీసిన విధానం, హంగులు ఆకట్టుకునేలా ఉన్నా డ్రామా, భావోద్వేగాలు మాత్రం పండలేదు. తమన్నా ప్రత్యేక గీతం బలవంతంగా చొప్పించినట్టే ఉంటుంది. తమన్నా అందం, నృత్యం మాత్రం అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే: వరుణ్‌తేజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బాక్సర్‌గా ఆయన కనిపించిన విధానం, అందుకోసం తనని తాను తీర్చిదిద్దుకున్న వైనం మెప్పిస్తుంది. క్రీడాకారుడిగా చక్కటి భావోద్వేగాల్ని పండించాడు. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, జగపతిబాబు పాత్రలు సినిమాకి కీలకం. ఉపేంద్ర, సునీల్‌శెట్టి బాక్సర్ల పాత్రలకి సరైన ఎంపిక అనిపిస్తుంది. నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. నదియా, సయీ మంజ్రేకర్ పాత్రల పరిధికి తగ్గట్టుగా చక్కటి అభినయం ప్రదర్శించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జార్జ్ సి.విలియమ్స్ కెమెరా పనితనం సినిమాకే హైలైట్. తమన్ బాణీల కంటే కూడా నేపథ్య సంగీతం సినిమాకి కీలకం. దర్శకుడు కిరణ్ కొర్రపాటికి ఇదే తొలి సినిమా. కథా నేపథ్యం ఆకట్టుకున్నా, తీయడంలో ఆయన ప్రదర్శించిన పరిణతి చాలలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
+ వరుణ్‌తేజ్ నటన
+ ద్వితీయార్ధం
+ ఛాయాగ్రహణం.. నిర్మాణ విలువలు
బలహీనతలు
- భావోద్వేగాలు పండకపోవడం
- ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథ
చివరిగా: ‘గని’ పంచ్ ఇంకాస్త గట్టిగా పడాల్సింది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?