F3: ట్రైలర్ చూసి మా ఫ్యామిలీ వాళ్లు షాక్ అయ్యారు: వరుణ్‌తేజ్
వరుణ్‌తేజ్, వెంకటేశ్ హీరోలుగా నటించిన సినిమా ‘ఎఫ్3’. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన సినిమా ‘ఎఫ్3’. తమన్నా, మెహరీన్ కథానాయికలు. దిల్ రాజు నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ పంచుకున్న ఫన్నీ ముచ్చట్లేంటో చూద్దాం!
‘గని’ వచ్చిన వెంటనే ‘ఎఫ్3’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎలా అనిపిస్తోంది.
వరుణ్ తేజ్: చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ఒక సినిమా విజయం సాధిస్తుందా? లేదా? అన్నది కేవలం ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారు. ‘ఎఫ్3’ తీయాలని ‘ఎఫ్2’ షూటింగ్ సమయంలోనే అనుకున్నాం. దీని పూర్తి బాధ్యతను అనిల్ తీసుకున్నారు. ఆయన మీద మాకు నమ్మకం ఎక్కువ. ఈ సినిమా చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది.
‘ఎఫ్3’లో మీ పాత్ర కోసం ఏమైనా సాధన చేశారా. ‘ఎఫ్3’ టీమ్‌తో నటించడం ఎలా అనిపించింది?
వరుణ్ తేజ్: కామెడీ చేయడం చాలా కష్టమని అర్థమైంది. మొదట చేయగలనా అని కంగారు పడ్డా. ఏ సన్నివేశంలో ఎలా నటించాలో అనిల్ దగ్గరుండి చెబుతారు. కాబట్టి అంత కష్టం ఉండదు. నాకు కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కొంచెం మొహమాటం. కానీ ‘ఎఫ్3’లో అందరూ అంతకు ముందు చేసిన వాళ్లే అయ్యేసరికి షూటింగ్ వాతావరణం అలవాటైపోయింది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బునే ప్రేమిస్తారు. ‘ఎఫ్2’ చూడని వాళ్లు ఈ సినిమా చూసినా అర్థమవుతుంది. నాకు వ్యక్తిగతంగా వెంకటేశ్ అంటే చాలా ఇష్టం. రెండుసార్లు ఆయనతో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే సునీల్ సినిమాలు చూసేవాడిని. ఆయన నాకు ఇష్టమైన కమెడియన్. దిల్‌రాజు నాకు చాలా క్లోజ్. సినిమాకు సంబంధించే కాకుండా విడిగా కూడా ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం.
టిక్కెట్ ధర విషయంలో తీసుకున్న నిర్ణయం మీ సినిమాకు కలిసివస్తుందంటారా?
వరుణ్ తేజ్: యూత్ సినిమాలకు ఒక్కొక్కరే వెళతారు. కానీ ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ అంతా కలిసి వస్తారు. ఇవి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అలా ఫ్యామిలీ అంతా వెళ్లాలంటే కొంతమందికి భారంగా ఉంటుంది. ఈ నిర్ణయం వాళ్లకి ఉపయోగపడుతుంది.
ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది?
వరుణ్ తేజ్: ప్రతి సినిమా ఇష్టమే. ఏ సినిమా అయినా దేనికదే ప్రత్యేకం. కొన్ని పాత్రలు చేయడం కష్టంగా ఉంటుంది. కొన్ని పాత్రలు చేయడం సులువుగా ఉంటుంది. ఏ సినిమా చేసినా పూర్తిగా న్యాయం చేస్తున్నానా లేదా అన్నది చూసుకుంటాను. కంచె సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఇష్టం.
హీరోలంతా పాన్ ఇండియా కథలవైపు వెళ్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
వరుణ్ తేజ్: కథలను ఎంచుకునే విధానం మారిందంటే అది పాన్ ఇండియా వల్ల కాదు. ఓటీటీల్లో ఎక్కువ కంటెంట్ అందుబాటులో ఉండడం వల్ల వారికి నచ్చే కథలను ఎంచుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మంచి కథలు బయటకు వస్తాయి. నాకు వ్యక్తిగతంగా యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అందుకని అలాంటి సినిమాలే చేయాలని అనుకోవడం లేదు. అన్ని రకాల సినిమాల్లో నటిస్తా. నాకు ముందే కథలు సిద్ధం చేసి పెట్టుకోవడం.. వరుసగా చేయడం నచ్చదు. ఒక సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల ఆదరణను బట్టి తర్వాత సినిమా ఎంచుకుంటాను. నేను పాన్ ఇండియా కథలు పది విన్నాను.
‘ఎఫ్3’ ట్రైలర్ చూసి మీ కుటుంబసభ్యులు ఎలా స్పందించారు. డబ్బు విషయంలో మీకెప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వచ్చిందా?
వరుణ్ తేజ్: అందరూ షాక్ అయ్యారు. మా ఇంట్లో కూర్చోని ట్రైలర్ చూశాం. అందరూ నువ్వేనా చేసింది అన్నారు. షూటింగ్స్‌కి వాళ్లు రాలేదు. నా మ్యానరిజం చూసి బాగా చేశావు అన్నారు. చరణ్ అన్న ఫోన్ చేసి బాగుంది ఫన్నీగా ఉంది అన్నాడు. డబ్బు విషయంలో నేను చాలా నేర్చుకున్నా. మా నాన్న ఎంత అడిగితే అంతే ఇస్తారు. కొన్ని రంగాల్లో వాళ్లకి డబ్బు తేలికగా వస్తుంది అనుకుంటారు. కానీ కష్టపడకుండా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం ఉండదు. డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి.
మెగా ఫ్యామిలీతో మల్టీస్టారర్ ఎప్పుడు వస్తుంది.
వరుణ్ తేజ్: చేయాలనే ఉంటుంది. కుదరాలి కదా. మేము ఇంట్లో సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోము. కేవలం కుటుంబపరమైన అంశాలే మాట్లాడుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్‌నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్