Varuntej: బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోన్న మెగాహీరో...!
‘ఆకాశాన్ని తాకేందుకు..’ అంటూ మెగా హీరో వరణ్‌తేజ్ తన తదుపరి చిత్రంపై ఇటీవల ప్రత్యేక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆకాశాన్ని తాకేందుకు..’ అంటూ మెగా హీరో వరణ్‌తేజ్ తన తదుపరి చిత్రంపై ఇటీవల ప్రత్యేక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ముంబయిలో అధికారికంగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో వరుణ్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేయనున్నారు.
యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపనుంది. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ గా నటించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర గతంలో చేసినవాటి కంటే పూర్తి భిన్నమైంది. దీని కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాను. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో
-
Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్‌నాథ్
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే!