VarunTej - Lavanya Tripathi: ఘనంగా వరుణ్-లావణ్య నిశ్చితార్థ వేడుక
వెండితెరపై జంటగా కనువిందు చేసిన కథానాయకుడు వరుణ్ తేజ్.. కథానాయిక లావణ్య త్రిపాఠి నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
వెండితెరపై జంటగా కనువిందు చేసిన కథానాయకుడు వరుణ్ తేజ్ (Varun Tej).. కథానాయిక లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ ప్రేమ జంట నిశ్చితార్థ వేడుకను అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో హైదరాబాద్‌లోని నాగబాబు స్వగృహంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి, అల్లు అరవింద్, లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని తెలిసింది. వరుణ్ - లావణ్య పెళ్లికి మరో రెండు నెలల సమయం ఉందని సమాచారం. ఇటలీలో ఈ వేడుక జరగనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలో పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. వరుణ్ - లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ అనే సినిమాతో పాటు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. అలాగే కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామా సినిమా చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: ప్రధానికి ఛాయ్ ఇచ్చిన రోబో.. ఫొటో మిస్ అవ్వొద్దన్న మోదీ
-
RuPay Credit card: యూపీఐ ఎఫెక్ట్.. రూపే కార్డులకు భలే డిమాండ్..!
-
ODI WC: వరల్డ్ కప్‌ను జట్టుగానే గెలుస్తారు.. ఏ ఒక్కరి వల్లనో కాదు: ఏబీ డివిలియర్స్
-
Chandrababu: చంద్రబాబు ఎస్ఎల్పీపై సుప్రీంలో విచారణ వాయిదా
-
Politics: మోదీకి పట్నాయక్ 8 రేటింగ్ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్‌కు 0 ఇచ్చింది!
-
Kamareddy: డీజే సౌండ్‌తో గుండెపోటు.. గణేష్ నిమజ్జనోత్సవంలో వ్యక్తి మృతి!