నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు

మెగా వారసురాలు నిహారిక పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోగల ఉదయ్‌ విలాస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సంబరాలు జరుగుతున్నాయి. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్‌ ఏర్పాటు....

Updated : 08 Dec 2022 16:46 IST

చెల్లిని భుజాలపై మోసిన వరుణ్‌తేజ్‌

హైదరాబాద్‌: మెగా వారసురాలు నిహారిక పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోగల ఉదయ్‌ విలాస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సంబరాలు జరుగుతున్నాయి. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్‌ ఏర్పాటు చేశారు. కాబోయే దంపతులతో కలిసి రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ తదితరులు చిందేశారు. తెలుగు పాటలతో ఉదయ్‌ విలాస్‌ హోటల్‌లో సందడి వాతావరణం నెలకొంది. తొలుత కటౌట్‌ గౌనులో మెరిసిన నిహారిక ఆపై ఎరుపు రంగు స్కట్‌లో తళుక్కుమన్నారు. కాబోయే భర్త చైతన్యతో కలిసి పెదనాన్న చిరంజీవి పాటలకు స్టెప్పులేశారు.

తన చిట్టి చెల్లెల్ని అన్నయ్య వరుణ్ తేజ్‌ భుజాలపై మోసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మామయ్య నాగబాబుతో కలిసి అల్లు అర్జున్‌ హంగామా చేస్తున్న మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వధూవరులు ‘బాయ్స్‌’ సినిమాలోని ‘అలే అలే..’ పాటకు హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో కూడా చక్కర్లు కొడుతోంది.

ప్రీ-వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం మెహందీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడుముళ్లు వేయబోతున్నారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని