VT13: వరుణ్ తేజ్ సినిమా కొత్త పోస్టర్ విడుదల..!
వరుణ్ తేజ్ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను వరుణ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వరుణ్‌తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమాను ‘VT13’ గా పిలుస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలోని పాత్ర కోసం వరుణ్ తేజ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను వరుణ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ‘90వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌డే సందర్భంగా ఆకాశంలో ఉన్న మన హీరోలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశాన్ని రక్షించడానికి మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మీరు చేసే ప్రతి పనికి మీకు ధన్యవాదాలు’ అని రాశారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంతో వరుణ్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేయనున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపనుంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)