Varun Tej: వరుణ్‌.. గాండీవధారి అర్జున

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమాకి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Updated : 20 Jan 2023 07:00 IST

రుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమాకి ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) అనే టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం వరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. అందులో ఓ భారీ పోరాట ఘట్టాన్ని గ్రాఫిక్స్‌లో చూపించారు. తుపాకీతో కాల్చుతూ వరుణ్‌ పాత్రను పరిచయం చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి.. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ఇది వరుణ్‌కు 12వ సినిమా. పూర్తిగా లండన్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇందులో సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా వరుణ్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని