Varun Tej: ‘కాంతార’ విజయం.. ఎవరు నటించారన్నది విషయం కాదు: వరుణ్‌ తేజ్‌

‘కాంతార’ (kantara) విజయంపై స్పందించారు నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej). ఏ సినిమా అయినా విజయం సాధించాలంటే అందులో ఎమోషన్స్‌ చక్కగా పండాలన్నారు.

Published : 21 Jan 2023 01:35 IST

హైదరాబాద్‌: రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార’ (Kantara)పై నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ప్రశంసల వర్షం కురిపించారు. సరైన భావోద్వేగాలు ఉన్నప్పుడు తప్పకుండా ఏ చిత్రమైనా విజయం సాధిస్తుందన్నారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సినిమాపై మాట్లాడారు. ‘‘ఒక సినిమాలో భావోద్వేగాలు ఎలా పండాయనే  దాని పైనే దాని విజయం ఆధారపడి ఉంటుంది. అందులో పని చేసిన నటీనటులు ఎవరు? బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి? అనే విషయాలతో సినిమా విజయానికి ఎలాంటి సంబంధం ఉండదు. మనం తెరకెక్కించిన కథ ప్రేక్షకులకు చేరువైతే చాలు.. అది తప్పక విజయం సాధించి తీరుతుంది. ‘పుష్ప’, ‘కాంతార’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో అదే జరిగింది’’ అని వివరించారు.

కర్ణాటక తులునాడులోని భూతకోల నేపథ్యంలో ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషబ్‌శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గతేడాది విడుదలై అంతటా మంచి విజయాన్ని అందుకుంది. ఇక, వరుణ్‌ తేజ్‌ సినిమాల విషయానికి వస్తే.. ‘గని’ (Ghani) తర్వాత ఆయన రెండు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అందులో ఒకదానికి ‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని