Ghani: పవన్‌ కల్యాణ్‌ ట్రెండ్‌ సెట్‌ చేశారు.. నేను ఫాలో అవుతున్నానంతే: వరుణ్‌తేజ్‌

విభిన్న కథా చిత్రాలతో పవన్‌ కల్యాణ్‌ ట్రెండ్‌ సెట్‌ చేశారని, అదే దారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు వరుణ్‌తేజ్‌. ఈయన హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించిన ‘గని’ చిత్రం.

Published : 07 Apr 2022 01:52 IST

హైదరాబాద్‌: తన సినిమాలతో పవన్‌ కల్యాణ్‌ ఓ ట్రెండ్‌ సెట్‌ చేశారని, అదే దారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు వరుణ్‌తేజ్‌. ఈయన హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌ చంద్ర, నదియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌’ను చిత్ర బృందం బుధవారం ఏర్పాటు చేసింది.

వేడుకనుద్దేశించి వరుణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్ర సర్‌ను తప్ప దర్శకుడు కిరణ్‌ మరెవ్వరినీ ఊహించుకోలేదు. ‘ఆయన కన్నడలో బిజీగా ఉంటారు. మన చిత్రంలో చేస్తారా లేదా’ అని నేను సందేహిస్తుంటే.. కిరణ్‌ ఆయన్ను ఒప్పించి తీసుకొచ్చాడు. ఆయన ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. మీరంతా ‘గని’లో కొత్త ఉపేంద్రను చూస్తారు. సాధారణంగా నేను ఫిట్‌గా ఉండను. కోచ్‌ పాత్ర పోషించిన సునీల్‌శెట్టి స్ఫూర్తితో రోజూ జిమ్‌కి వెళ్లి ఫిట్‌గా మారా. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర చాలా అద్భుతంగా నటించాడు. రామజోగయ్య శాస్త్రి పాటలు, అబ్బూరి రవి మాటలు సినిమాకు కీలకంగా నిలుస్తాయి. తమన్‌ సంగీతానికి థియేటర్లలో సౌండ్‌ బాక్సులు బద్దలవుతాయి. ఇప్పటికే చెప్పాను అయినా మరోసారి చెప్తున్నా.. బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌) నటించిన ‘తమ్ముడు’ చిత్రం నన్నెంతో ప్రభావితం చేసింది. విభిన్న కథా చిత్రాలతో ఆయన ట్రెండ్‌ సెట్‌ చేశారు. నేను ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నానంతే. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మీ అందరి ఆదరణతో మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సయీ మంజ్రేకర్‌, సునీల్‌శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని