F3: వేసవిలో నవ్వులే.. నవ్వులు

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఎఫ్‌3’. గతంలో ఈ ముగ్గురి కలయిక నుంచి వచ్చిన ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా

Updated : 30 Jan 2022 07:45 IST

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఎఫ్‌3’. గతంలో ఈ ముగ్గురి కలయిక నుంచి వచ్చిన ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహన్‌ కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క పాట మినహా సినిమా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్లో వెంకీ, వరుణ్‌ కలిసి ఉన్న ఫొటోతో పాటు చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘మా షూటింగ్‌ పూర్తయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుతుంది. వస్తే కొద్దిగా ముందుగా.. వెళ్లినా కొద్దిగా వెనకగా.. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా. వినోదం, గ్లామర్‌.. ఇలా అన్ని రకాల వాణిజ్య హంగులతో ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలి ఉన్న ఒక్క పాటను త్వరలో చిత్రీకరిస్తాం’’ అని నిర్మాతలు  తెలిపారు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు