Ghani: ‘గని’.. ఆగమనం ఈ నెలలోనే

‘గని’ సినిమా విడుదల ఖరారైంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం ఎప్పుడొస్తుందంటే...

Published : 15 Feb 2022 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ కారణంగా చిత్ర పరిశ్రమలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయోనని ఒక్కో చిత్ర బృందం తమ సినిమాకు సంబంధించి రెండు విడుదల తేదీలను ప్రకటిస్తోంది. ఈ జాబితాలోనే నిలిచింది ‘గని’ సినిమా. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు దర్శకనిర్మాతలు. ఫిబ్రవరి 25నే ఫిక్స్‌ చేసినట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాక్సింగ్‌ చేస్తూ పవర్‌ఫుల్‌గా కనిపించారు వరుణ్‌. ఈ సినిమాలో వరుణ్‌ సరసన బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ నటించింది. సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని