Varun Tej: ఏజెంట్‌గా.. వరుణ్‌?

ఇటీవలే ‘ఎఫ్‌3’తో (F3) వినోదాలు పంచారు కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ (VarunTej).

Published : 12 Jul 2022 14:44 IST

ఇటీవలే ‘ఎఫ్‌3’తో (F3) వినోదాలు పంచారు కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ (VarunTej). ఇప్పుడు కొత్త సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌  కథాంశంతో రూపొందుతోంది. పూర్తిగా లండన్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో వరుణ్‌ ఓ  ఇంటర్నేషనల్‌ ఏజెంట్‌గా స్టైలిష్‌ అవతారంలో కనిపించనున్నారని సమాచారం. ఈ గూఢచారి పాత్ర కోసం ఆయన ప్రస్తుతం తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రమిది. స్క్రిప్ట్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని