varuntej: విజయాల కంటే వైఫల్యల నుంచే ఎక్కువ నేర్చుకున్నా: వరుణ్‌ తేజ్

‘ముకుందా’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా మెగా హీరో వరుణ్‌తేజ్. ఆ తర్వాత కంచె, అంతరిక్షం, గని లాంటి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ సినిమా(varun13)లో నటిస్తున్నారు.

Published : 27 Sep 2022 01:46 IST

హైదరాబాద్‌: మెగా హీరో వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ సినిమా(varun13)లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఈ యంగ్‌ హీరో. తను విజయాల కంటే వైఫల్యాల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను చూస్తున్నానని వాళ్లని అర్థంచేసుకుంటున్నానని చెప్పారు.

‘‘ఈ చిత్రంలో నేను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నా. ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నాను. ఇందులో మన సాయుధబలగాలు ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నాయో చూపించనున్నాం. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నానని ఎంత ఉత్సాహంగా ఉన్నానో అంతే భయపడుతున్నాను. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగలగాలి.  ఈ సినిమా కోసం నేను చాలా మంది పైలట్‌లను కలిశాను.  వాళ్ల జీవితాలను దగ్గరి నుంచి చూసి నేర్చుకున్నాను. కొంతమంది అధికారులను కూడా కలిశా. వాళ్లతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నా’’ అన్నారు.

‘‘సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అలరించింది. ‘బ్రహ్మాస్త్రం’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా ఆడింది. నేను ప్రతి సినిమాకు నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. అందుకే కష్టపడి పని చేస్తాను. ‘గని’ సినిమా కోసం ఎంతో శిక్షణ తీసుకున్నా. ఆ సినిమా నన్ను నిరాశపరిచినా దాని కోసం తీసుకున్న శిక్షణ నాకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. నేను విజయాల కంటే వైఫల్యాల నుంచే ఎక్కువ నేర్చుకున్నాను’’అంటూ తన సినిమాలను గుర్తుచేసుకున్నారు వరుణ్‌ తేజ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని