Vasantha kokila: ‘వసంత కోకిల’ ట్రైలర్‌ విడుదల చేసిన మెగాస్టార్‌

బాబీ సింహా హీరోగా తెరకెక్కిన ‘వసంత కోకిల’ చిత్ర ట్రైలర్‌ను చిరంజీవి లాంచ్‌ చేశారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదలవ్వనుంది.

Published : 06 Feb 2023 15:37 IST

హైదరాబాద్‌: బాబీ సింహా(Bobby Simha) హీరోగా రమణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘వసంత కోకిల’(Vasantha kokila). ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ మూడు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. నటీనటుల మధ్య లవ్‌ ట్రాక్‌, వారి చుట్టూ జరిగే సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాలో సింహా సరసన కశ్మీర పరదేశీ నటిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. మధుర ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్‌ తల్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కన్నడ ట్రైలర్‌ను స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ లాంచ్‌ చేశారు. ఆర్య కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్‌ మురుగేశన్‌ సంగీతం అందిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని