Kalyan Ram: బింబిసార2పై అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్...
కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా బింబిసార. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ సినిమా షూటింగ్‌పై దర్శకుడు వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. ప్రేక్షకుల అంచనాలను తగ్గట్టు బింబిసార2 ఉండనుందని పేర్కొన్నారు.
హైదరాబాద్: కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బింబిసార’. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చిత్రబృందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు.
‘‘సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార చిత్రాన్ని అందరూ ఎంతగానో ఆదరించారు. ఊహించని విజయాన్ని అందించారు. ప్రస్తుతం వాళ్లందరూ ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. నేను అభిమానులందరికీ కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించనున్నాం. మొదటిభాగం భారీ హిట్ సాధించినందున రెండో భాగం దానికి మించి తీయాలనే ఒత్తిడి నాపై ఉంది. కల్యాణ్ రామ్ తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార2 సినిమా షూటింగ్ మొదలవుతుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమాలో నటిస్తున్నారు. నవీన్ మేడారం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?